Homeహైదరాబాద్‌Election | జూబ్లీహిల్స్లోలో మొదలైన అసలు ఆట

Election | జూబ్లీహిల్స్లోలో మొదలైన అసలు ఆట

  • జూబిలీహిల్స్ బైపోల్లో బీజేపీకి జనసేన మద్దతు
  • కాంగ్రెస్కి తెలంగాణ జన సమితి, ఎంఐఎం మద్దతు
  • నగరంలో హవా తమదే అని తొడ గొట్టిన కేటీఆర్
  • బీజెపీకి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్నాడా?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఒక్క సీటు అయినా రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టాత్మకంగా మారింది. హైదరాబాదులోని ఈ కీలక నియోజకవర్గం ఫలితం మూడు ప్రధాన పార్టీల భవిష్యత్తు దిశను సూచించే సూచికగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. ఇప్పటికే పార్టీలు బహిరంగంగా తమ వ్యూహాలు ప్రకటిం చడంతో ప్రచారం కొత్త దశలోకి అడుగుపెట్టింది. జనసేన తాజాగా బిజెపికి మద్దతు ప్రకటించడంతో ఎన్నికల్లో కొత్త ఉత్సాహం నిండింది.

జూబ్లీహిల్స్ లోని మధ్యతరగతి, యువత, సినీ కార్మికులు ఉన్నత శాతం ఓటర్లుగా ఉన్నందున ఈ మద్దతు బిజెపికి బలం చేకూరుస్తుందని పార్టీ అంచనా వేస్తోంది. తెలంగాణా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు నారగోని శంకర్ గౌడ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో భేటీ కావడం ద్వారా రెండు పార్టీల మధ్య సమన్వయం బలపడింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారంలో పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “ప్రజలు మార్పు కోరుకుంటున్నారు” అనే నినాదంతో బిజెపి-జనసేన కలయిక కొత్త శక్తిగా ఎదుగుతుందనే ధీమా వ్యక్తమవుతోంది.

- Advertisement -
ubilee hills bypoll political alliances janasena bjp congress aimim 14


ఇక బిఆర్ఎస్ మాత్రం ఈ ఉప ఎన్నికను తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకునే వేదికగా తీసుకుంటోంది. “హైదరా బాద్ మా కోట” అంటూ కేటీఆర్ బహిరంగంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నగర అభివృద్ధి, మున్సిపల్ సదుపాయాలు, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై బిఆర్ఎస్ తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో 17 నియోజక వర్గాల్లో విజ యాలు సాధించిన అనుభవంతో బిఆర్ఎస్ “స్థిరత్వం కోసం ఓటే యండి” అనే స్లోగన్తో ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తుంది.

ubilee hills bypoll political alliances janasena bjp congress aimim 4

కేటీఆర్ నాయకత్వం, కేడర్ సన్నద్ధత బిఆర్ఎస్ కు ప్రధాన బలం అవుతాయని పార్టీ నమ్మకం. కాంగ్రెస్ పరిస్థితి ఈసారి కొత్త వ్యూహంతో ముందుకెళుతోంది. తెలంగాణ జనసమితి నాయ కుడు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు, ఎంఐఎం మద్దతులతో తమకు మరింత బలం చేకూరుతోందని, మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నామని, తమ ప్రచారంలో అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొని ప్రచారాన్ని మరింత ఉదృతం చేస్తు న్నారని, తమకు అధినాయకత్వమయిన, సోనియా, రాహుల్ అండాదండాలున్నాయని, గెలిచి జూబిలీహిల్స్ ను అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమాగా చెప్తోంది కాంగ్రెస్.

ubilee hills bypoll political alliances janasena bjp congress aimim 3

ఇక “ప్రజల సమ స్యలే మా అజెండా” అంటూ పార్టీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న అసం తృప్తిని లాభంగా మలచుకోవడమే కాంగ్రెస్ ప్రధాన వ్యూహం. అయితే మైనారిటీ ఓటు బ్యాంక్ ఎటు మొగ్గుతుందన్నది ఈ ఎన్నికల్లో కీలక అంశంగా మారనుంది. ఇక మిగతా చిన్న పార్టీల విషయంలో పరిస్థితి పెద్దగామారలేదు. జూబ్లీహిల్స్లో కుల, వర్గ, ప్రాంతీయ సమీకరణాలు పెద్దగా ప్రభావం చూపవు.

అభ్యర్థుల వ్యక్తిత్వం, పార్టీ గుర్తింపు, నాయకుల ప్రజాప్రభావం ఈ సారి ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఎన్నికల వేడిరోజురోజుకు పెరుగుతోంది. మూడుప్రధాన పార్టీలు తమ తమ శైలిలో ప్రచారానికి సిద్ధమవు తున్నాయి. బిజెపి జనసేన శిబిరాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుం డగా, బిఆర్ఎస్ మాత్రం తన కేడర్ బలంపై ఆధారపడుతోంది. కాంగ్రెస్ చివరి నిమిషంలో మైనారిటీ, బీసీ ఓటర్లను ఆకర్షించ డానికి కసరత్తు ప్రారంభించింది.

మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచిగా మారింది. ఈ సీటు ఫలితం కేవలం ఒక్క నియోజకవర్గం పరిమితి కాదు భవిష్యత్తు కూటముల స్వరూపం, నాయకుల ప్రభావం, ప్రజల అభి మతం ఏ దిశగా ఉందో చూపించే సూచికగా నిలవనుంది. పార్టీలు మాటల యుద్ధంలో దిగిపోయాయి, ప్రచారం మోత ముమ్మ రం అవుతోంది, ఓటర్ల మనసు ఏ వైపుకు వాలుతుం దన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News