- పేద బీద మైనార్టీల గొంతుక కాంగ్రెస్ పార్టీ
- కాంగ్రెస్ పార్టీ సిదాంతమే బీద ప్రజల సౌకర్యం
- చెల్లిని గెంటేసిన నీచుడు కేటీఆర్
- బీఆరెస్, బీజేపీ ది ఫెవికాల్ బంధం.. ఇది నిజం కాకపోతే కేసీఆర్, హరీష్, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి
- ‘ఫార్ములా ఈ’ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..
- చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్లో బీజేపీ బీఆరెస్ కు పరోక్ష మద్దతు ఇస్తోంది
- ఎందుకంటే. రాబోయే రోజుల్లో బీఆరెస్ బీజేపీలో విలీనం అవుతుంది
- రహమత్ నగర్ రోడ్ షోలో సీఎం రేవంత్ వెల్లడి

జూబ్లీహిల్స్లోలో 30 వేల మెజార్టీ తో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పేద బీద మైనార్టీ ల గొంతుక కాంగ్రెస్ పార్టీ అని ఎల్లప్పుడు వారి సంక్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ సిదాంతమే బీద ప్రజల సౌకర్యం అని అన్నారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేస్తున్నటువంటి ఏఐఎంఐఎం.. సిపిఐ సిపిఎం.. మరియు మాదిగ దండోరా..

మరియు ఇతర కుల సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఉప ఎన్నికలు వచ్చాయి.. మా అభ్యర్థి చనిపోయారు? ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి పీజేఆర్ అన్నారు. పీజేఆర్ ఆడబిడ్డల కోసం కృష్ణ జలాలు హైదరాబాద్ తీసుకువచ్చారని, పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చింది పీజేఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పీజేఆర్ చనిపోతే.. ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా పీజేఆర్ కుటుంబానికి మద్దతు ఇచ్చారని, కానీ కేసీఆర్ మాత్రం.. సెంటిమెంట్ లేదు.. ఏకగ్రీవం ఇచ్చేది లేదని పీజేఆర్ కుటుంబం మీద పోటీకి పెట్టారన్నారు. పీజేఆర్ కుటుంబంనీ కేసీఆర్ తన ఇంటి ముందు మూడు గంటలు కూర్చోపెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా..
‘పాలేరులో రాంరెడ్డి వెంకట్ రెడ్డి చనిపోతే.. నారాయణపేట లో కృష్ణారెడ్డి చనిపోతే పోటీ పెట్టింది కేసీఆర్ కాదా.. ఆనాడు చేసిన తప్పులకు బీఆర్ స్ నేతలు క్షమాపణ చెప్పాలి. ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే.. నీ సొంత చెల్లెలి కి వాటా ఇవ్వాల్సి వస్తుందని చెల్లిని బయటకు పంపిన కసాయి కేటీఆర్ కాదా.. అని కెటీఆర్ను ఉద్దేశించి విమర్శించారు. సొంత చెల్లెల్ని బయటకు గెంటేసి నీచుడు కేటీఆర్.. మీ సొంత అన్న ఇట్లనే అవమానిస్తే.. ఊరుకుంటారా..? వేలకోట్లు కొల్లగొట్టుకున్న వ్యక్తి కేటీఆర్.. పావలా వంతు అయినా..

చెల్లికి ఇవ్వచ్చు మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు.. ఐదేళ్లు మంత్రి పదవులు ఇవ్వకుండా. అవమానించిన ది నువ్వు కాదా..? ఇందిరాగాంధీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ నీ నడపలేదా.. సోనియా గాంధీ.. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నీ నడపడం లేదా..? పదేళ్లలో ఈ పనికి .. మాలిన వాడు రేషన్ కార్డు ఇచ్చాడా.. ఫార్మ్ హౌస్ లో మీరు. ఏమైనా వాటా అడిగారా..? రేషన్ కార్డు ఒక్కటే కదా మీరు అడిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
మీతోనే నిరంతరం ఉండే నవీన్ యాదవ్ గెలిస్తే మీ వెంటే ఉండి సమస్యలు పరిష్కరిస్తాడని అన్నారు.
“కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారు.. కాళేశ్వరం కేసును సీబీఐ కి పంపిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు.. మీరు, వాళ్లు ఒక్కటి కాకపోతే.. బీఆరెస్, బీజేపీ ది ఫెవికాల్ బంధం కాకపోతే. ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ ఐఆర్ చేయాలి కెసీఆర్, హరీష్, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..
ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటి? చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్ లో బీజేపీ బీఆరెస్ కు పరోక్ష మద్దతు ఇస్తోంది ఎందుకంటే. రాబోయే రోజుల్లో బీఆరెస్ బీజేపీ లో విలీనం అవుతుందిఇది నేను అంటున్నది కాదు.. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్నదే.”. అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, అజ్జరోద్దీన్ , పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, సీ.ఎన్ రెడ్డి, ఎఐఎంఐఎం రాష్ట్ర నాయకులు.. ఎమ్మెల్సీలు.. ఎన్ఎస్ఈయూఐ నాయకులు.. వివిధ కార్పొరేషన్ చైర్మన్లు.. స్థానిక నాయకులు, కార్యకర్తలు.. ప్రజలు పాల్గొన్నారు.
