Monday, May 11, 2026
Homeరంగారెడ్డిMaisamma | అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి.

Maisamma | అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి.

  • బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల జగన్.
  • మైసమ్మ దేవాలయానికి రూ. 1,51,011/- విరాళం అందజేత.

అమ్మలను గన్న అమ్మ మైసమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల జగన్ యాదవ్ అన్నారు. నందిగామ మండలం అంతిరెడ్డిగూడ గ్రామపంచాయతీ జంగోనిగూడ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మతల్లి గుడి నిర్మాణానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తుమ్మల జగన్ యాదవ్ ఆదివారం 1,51,011/- (లక్ష యాభై ఒక్క వెయ్యి పదకొండు) రూపాయలను విరాళంగా దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతల ఆశీస్సులతోనే గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉంటారని, అమ్మవారి దేవాలయ నిర్మాణంలో భాగస్వామినవ్వడం ఆనందంగా ఉందన్నారు.గ్రామ ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి దేవాలయానికి తమవంతు సహయ, సహకారాలను అందించి అమ్మవారి కృపకు పాత్రులవ్వాలని పేర్కొన్నారు.ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజాలందరిపై ఉండాలని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామంలో జరిగే సామాజిక సేవలో ముందుంటానని, గ్రామాభివృద్ధి కొసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News