Monday, May 11, 2026
Homeరంగారెడ్డిShadnagar | అంజన్న మకుటంలేని నాయకుడు.

Shadnagar | అంజన్న మకుటంలేని నాయకుడు.

  • మాజీ పిఏసీఎస్ చైర్మన్ మామిళ్ల విఠల్.
  • ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు.

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మకుటం లేని నాయకుడని చేగూర్ మాజీ పిఏసీఎస్ చైర్మన్ మామిళ్ల విఠల్ ముదిరాజ్ పేర్కొన్నారు. షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ఎల్గనమోని అంజయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారుచేసిన కేకును మాజీ ఎమ్మెల్యే అంజన్నతో కట్ చేయించి మామిళ్ల విఠల్ తినిపించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ అన్న అంటే నేనున్నానంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మకుటం లేని మహా నాయకుడు అంజన్న అని తెలిపారు.

షాద్ నగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అంజన్న అహర్నిశలు కృషి చేశారన్నారు. ప్రతి గ్రామంలో అంజన్న చేసిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందన్నారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అంజన్న ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టి తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బంటారం మల్లేష్,ఎర్రోళ్ల నర్సింహా,కొలం రమేష్,తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News