Homeభక్తిTTD | శ్రీవారి భక్తులకు శుభవార్త..

TTD | శ్రీవారి భక్తులకు శుభవార్త..

  • అక్టోబర్ నెలలో ప్రత్యేక దర్శన టికెట్లు..
  • 12, 13, 14, 18, 19, 20 తేదీలకు విడుదల..

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) గుడ్ న్యూస్ తెలిపింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల రోజులకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబర్ 12, 13, 14, 18, 19, 20 తేదీలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 7 బుధవారం నాడు ఉదయం 10:00 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు అధికారిక వెబ్‌‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవాలని, నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవద్దని అధికారులు స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News