Wednesday, December 10, 2025
EPAPER
Homeస్పోర్ట్స్WPL-2026 | జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్

WPL-2026 | జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) క్రికెట్ (Cricket) 2026 జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగుతుంది. ఈ విషయాన్ని బీసీసీఐ (BCCI) వెల్లడించింది. పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం డబ్ల్యూపీఎల్ మెగా ఆక్షన్ (Mega Auction) ఢిల్లీలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ల తేదీలు, వేదికల గురించి లీగ్ చైర్మన్ జయేశ్ రంజన్ ప్రకటించారు. మ్యాచ్‌లు నవీ ముంబై, వడోదరలో జరుగుతాయి. డబ్ల్యూపీఎల్ ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి కాగా ఇప్పుడు జరగబోయేది నాలుగో సీజన్. రెండు సార్లు ముంబై (Mumbai) విజేతగా నిలిచింది. ఒకసారి రాయల్ ఛాలెంజర్స్(Royal Challengers) గెలిచింది. ఇదిలా ఉండగా ఇవాళ జరిగిన వేలంలో తెలుగు అమ్మాయి శ్రీచరణి (SriCharani)ని ఢిల్లీ (Delhi) జట్టులోకి తీసుకున్నారు. ఈమెను రూ.1.30 కోట్లకు కొనుగోలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News