Tuesday, December 9, 2025
EPAPER
Homeక్రైమ్ వార్తలుBSF | కోటికి పైగా విలువైన బంగారం బిస్కెట్ల స్వాధీనం

BSF | కోటికి పైగా విలువైన బంగారం బిస్కెట్ల స్వాధీనం

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Boarder Security Force) కోటి రూపాయలకు పైగా విలువైన బంగారం బిస్కెట్ల(Gold Bisuits)ను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌(West Bengal)లోని మాల్దా జిల్లాలో బుధవారం జరగ్గా.. గురువారం వెల్లడించింది. బీఎస్ఎఫ్‌ 119 బెటాలియన్(battalion).. ఇండియా, బంగ్లాదేశ్ (India, Bangladesh) సరిహద్దులోని సౌత్ బెంగాల్ (South Bengal) ప్రాంతంలో గస్తీ తిరుగుతూ తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక సైకిల్‌(Bicycle)లో బంగారం బిస్కెట్లు దాచిపెట్టి ఉండటం గమనించారు. సైకిల్ తొక్కే వ్యక్తి బీఎస్ఎఫ్ సిబ్బందిని చూసి, సైకిల్‌ను అక్కడే వదిలేసి పరారయ్యాడు. తనిఖీల్లో దొరికిన ఆ ఏడు బిస్కెట్ల బరువు 816.41 గ్రాములు, విలువ రూ.1.02 కోట్లు ఉంటుందని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News