Homeనల్లగొండMarket Yard | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Market Yard | రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట, నవంబర్ 13 (ఆదాబ్ హైదారాబాద్): సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డు(Suryapet Agricultural Market Yard)ను చైర్మన్ (Chairman) కొప్పుల వేణారెడ్డి ఆకస్మిక తనిఖీ (Sudden Inspection) చేశారు. యార్డ్ కార్యకలాపాలు, కొనుగోలు కేంద్రాల పనితీరు, రైతులకు అందుతున్న సేవలను (Services) ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల(Farmers)తో మాట్లాడి వారి సమస్యలు(Problems), యార్డులోని సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యత(Quality)ను చూశారు. తూకాల ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా అనే అంశంపై సిబ్బందిని ఆరా తీశారు.

- Advertisement -
WhatsApp Image 2025 11 13 at 20.36.59

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అనవసర జాప్యం జరగకూడదని చెప్పారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర (Support Price) పూర్తి స్థాయిలో లభించేలా పర్యవేక్షణను బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రతి రైతు మార్కెట్ యార్డులో న్యాయం పొందాలనే ధ్యేయంతో వ్యవస్థను బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. సమస్యలు ఉన్న చోట వెంటనే స్పందించాలని కోరారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, దీనికోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కొప్పుల వేణారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News