కమిట్మెంట్ ఉన్న యువనాయకుడు కావాలి దేశానికీ, పట్టుదలతో ప్రజల బాటలో నడిచే మనసు కావాలి. అభివృద్ధి మాటలతో మాయ చేసే వసూల్ రాజాలు కాదు, ఊరి భవిష్యత్తు కబళించే దోపిడీదార్లు కాదు. మట్టి వాసన తెలిసినవాడు పాలన చేయాలి, నిజం మాట్లాడే ధైర్యం ఉన్నవాడు ముందుకు రావాలి. ఓటు కేవలం చెయ్యి కాదు, నీ బలమే, నీ గౌరవమే, దాన్ని అమ్మితే నీ ఆశలే కూలిపోతాయి సునామీలా. తప్పుడు నాయకుడి నవ్వు విషం.. గుర్తు పెట్టుకో, ఆ నవ్వుతో నీ ఊరి కంటతడి పుడుతుంది రేపు. యువతా! నీ చేతిలో ఉంది భవిష్యత్తు జ్యోతి, అబద్ధం కరిగించే నిజాయితీ మంట వెలగించు!
- సౌరం జితేందర్
