సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మూవీ యాక్టింగ్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఒక నెల రోజులపాటు జరిగే వేసవి శిక్షణా తరగతుల సమావేశo తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, గౌరవ అతిధిగా రంగస్థల కళల శాఖాధిపతి ఆచార్య బిహెచ్. పద్మప్రియ, అకాడమిక్ డీన్ ఆచార్య వనజ ఉదయ్, యాక్టింగ్ వర్కుషాప్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాజు, విద్యార్థులు, తదితరులు హాజరైన్నారు.
రిజిస్ట్రార్ మాట్లాడుతూ ప్రపంచం అంత ఈ రోజు మెత్తడ్ యాక్టింగ్ కు అలవాటు పడుతున్నారు. యాక్టర్ కు బాడి మీద కంట్రోల్ ఉండాలి. స్టేజిలను బట్టీ అంటే మాద్యమాలను బట్టి మాట్లాడడంగాని నటించడంగాని ఒక యాక్టర్ కు తెలిసి ఉండాలని తెలిపారు. శాఖాధిపతి మాట్లాడుతూ మిమల్ని మీరు సినిమాలో ఎలా చూసుకోవాలి అని అనుకుంటూన్నారనీ, యాక్టింగ్ నేర్చుకోవడానికి కావలసిన సూచనలు తెలియచేసారు.
అకాడమిక్ డీన్ ఆచార్య వనజా ఉదయ్ మాట్లాడుతూ శిక్షణా శిబిరంలో చేరిన వారందరూ రాబోయే రోజుల్లో పెద్ద స్క్రీన్ మీద కానీ బుల్లి తెర మీద గాని మీరంతా యాక్టర్స్ గా ఒక్క వెలుగు వెలగాలని ఆకాంక్షించారు. అనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్ సమ్మర్ మూవీ యాక్టింగ్ క్యాంపు డైరెక్టర్ డా.రాజు మాట్లాడుతూ తాను నెల రోజుల పాటు ఇచ్చే శిక్షణకు సంబంధించిన పలు సూచనలను సలహాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వవిద్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
