Thursday, May 14, 2026
Homeరంగారెడ్డిMalkajgiri MLA | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

Malkajgiri MLA | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ

  • ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.గౌతమ్ నగర్ డివిజన్ కు చెందిన వసంతకు 25,000, కుశాల్ రావుకు 45,500, శ్రావణికి 35,000 పద్మావతికీ 16,500, లావణ్యకీ 52,000 అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ పేద , మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతున్నదని తెలిపారు. ప్రజలకు అవసరమైన సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News