HomeతెలంగాణExtended | రేషన్ కార్డు హోల్డర్స్ కి ఊరట..

Extended | రేషన్ కార్డు హోల్డర్స్ కి ఊరట..

  • ఈ-కేవైసీ గడువు పొడగింపు..
  • జీ. హెచ్.ఎం.సి. పరిధిలోని వారికి అవకాశం..

రేషన్‌ కార్డుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునేందుకు ఇచ్చిన గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోయిన వారికి ఇది పెద్ద ఊరటగా మారింది.

మొదట ఈ వెసులుబాటును జీహెచ్‌ఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇతర జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ‘స్మార్ట్‌’ ప్రక్రియ, పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

మరోవైపు రేషన్‌ కార్డుదారులకు మరో శుభవార్త కూడా ఉంది. ఈ-కేవైసీ పూర్తయిందా లేదా అన్న దానితో సంబంధం లేకుండా శనివారం నుంచి మూడు నెలల బియ్యం, ఇతర రేషన్‌ సరకులను ఒకేసారి పంపిణీ చేయనున్నారు. సూపర్‌ ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని వారు ఆగస్టు 31లోపు సమీప రేషన్‌ దుకాణంలో ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News