Homeహైదరాబాద్‌Vinayaka Chavithi Celebrations | గాంధీభవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Vinayaka Chavithi Celebrations | గాంధీభవన్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

  • పీసీసీ చీఫ్‌కు జగ్గారెడ్డి శుభాకాంక్షలు

రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో(Gandhi Bhavan) వినాయక చవితి పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా(Vinayaka Chavithi Celebrations), సందడిగా జరిగాయి. పండుగ సందర్భంగా గాంధీభవన్‌కు చేరుకున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy)… టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను(TPCC President Mahesh Kumar Goud) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలబొకే అందించి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.

​ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకులు మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులంతా ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు నాయకులు తెలిపారు. అనంతరం కార్యకర్తలకు, నాయకులకు తీపి పదార్థాలు పంపిణీ చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News