పుస్తకాల్లోని అక్షరాలు మెదడుకు చేరడమే కాదు.. ప్రయోగశాలలోని అనుభవాలు మేధస్సును పదును పెట్టాలి.. కేవలం ర్యాంకుల వేటలో యాంత్రికంగా మారకుండా, శాస్త్రీయ దృక్పథంతో సమస్యలను పరిష్కరించే సరికొత్త విద్యా విప్లవానికి తెలంగాణ ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ప్రాక్టికల్ నాలెడ్జ్ తో కూడిన ఈ విద్యా సంస్కరణలు.. రేపటి తరం విద్యార్థులను కేవలం ‘పరీక్షల విజేతలు’గా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయి ‘పరిశోధకులు’గా, ‘నవకల్పనల సృష్టికర్తలు’గా తీర్చిదిద్దనున్నాయి. అభ్యాసం అంటే గుర్తుపెట్టుకోవడం కాదు.. అర్థం చేసుకోవడం, ఆచరించడమని ఈ మార్పు నిరూపించబోతోంది..
- Advertisement -
