Homeనిజామాబాద్‌Jayanti | ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.

Jayanti | ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి.

  • విశ్వ బ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షుడు కిషోర్ .

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రభుత్వ అధికారికంగా నిర్వహించాలని తాడ్వాయి మండలం విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కిషోర్ డిమాండ్ చేశారు. గురువారం తాడ్వాయి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని గుర్తు చేశారు.

Professor Jayashankar Birth Anniversary Celebrations In Tadwai

తెలంగాణ నిధులు, నియామకాలు, ఉద్యోగాలు, వనరులు,తెలంగాణకే చెందాలని మొదట పోరాడిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన మొట్టమొదట వ్యక్తి జయశంకర్ అన్నారు.జయశంకర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, జయంతి జరపాలన్నారు. ఉన్నత చదువులు చదివి ఆర్థిక శాస్త్రంలో పట్టా పొంది, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా పని చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కార్యదర్శి కమ్మరిరాజు చారి కోశాధికారి కమ్మరి దుర్గాప్రసాద్,నందివాడ ఉపాధ్యక్షులు విజయరాజు, కృష్ణాజీవాడి మనుబ్రహ్మ సంఘ అధ్యక్షులు కమ్మరి శ్రీకాంత్,మాయబ్రమ్మ సంఘం కృష్ణజివాడి కోశాధికారి వడ్ల రాజు, బాలచంద్రం నాగరాజు చారి, సంఘం సభ్యులు పాలొగొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News