Homeహైదరాబాద్‌Governor | వాజ్‌పేయికి ఘన నివాళులు

Governor | వాజ్‌పేయికి ఘన నివాళులు

మాజీ ప్రధాని(Former PM), భారతరత్న(Bharat Ratna) అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) జయంతి(Birth Anniversary) సందర్భంగా ఆయనకి తెలంగాణ రాష్ట్ర గవర్నర్(Telangana State Governor) జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఘనంగా నివాళులు అర్పించారు. సికింద్రాబాద్‌లోని వాజ్‌పేయి పార్క్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత లోక్ భవన్‌లో వాజ్‌పేయి చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.

Atal Bihari Vajpayee2

ఆయన జయంతిని సుపరిపాలన దినోత్సవం(Good Governance Day)గా పాటించారు. ఈ సందర్భంగా.. వాజ్‌పేయి దేశానికి చేసిన అమూల్యమైన సేవలను గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఆయన దార్శనిక రాజనీతిజ్ఞుడని, వాగ్ధాటిగల పార్లమెంటేరియన్ అని కొనియాడారు. దేశ ప్రజాస్వామ్య పునాదులను, జాతీయ ఐక్యతను బలోపేతం చేసిన నాయకుడని గవర్నర్ కీర్తించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News