Homeమహబూబ్‌నగర్‌Warning | నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

Warning | నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

  • జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి..

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డి సునీత రెడ్డి హెచ్చరించారు. గురువారం గోపాల్ పేట, ఏదుల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఎస్పీ అకాస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పెట్రోలింగ్ క్విక్ రెస్పాన్స్ టీమ్ లను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.

SP Sunitha Reddy Inspects Nomination Centers.1

ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా పనిచేయాలని అధికారులకు సూచించారు.అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అనైతిక ప్రలోభాలు వంటి తప్పిదాలు ఎక్కడైనా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వర్ రావు, వనపర్తి సిఐ కృష్ణయ్య, గోపాల్ పేట ఎస్సై నరేష్, రేవల్లి ఎస్సై రజిత, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

SP Sunitha Reddy Inspects Nomination Centers 2
- Advertisement -
RELATED ARTICLES

Latest News