రేపు ఆదివారం. మామూలుగా అయితే స్టాక్ మార్కెట్ల(Stock Markets)కు ప్రతి శనివారం, ఆదివారం సెలవు. కానీ.. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్(Union Budget)ను పార్లమెంట్‌లో ప్రవేశపెడుతున్న సందర్భంగా స్టాక్ మార్కెట్లు(BSE and NSE) పనిచేస్తాయి. ఈ మేరకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (National Stock Exchange) ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. 2026 ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో స్టాండర్డ్ మార్కెట్ టైమింగ్స్ ప్రకారం లైవ్ ట్రేడింగ్ సెషన్ ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు జరుగుతుందని పేర్కొంది. గతంలో ఎక్కువ శాతం బడ్జెట్ ప్రజెంటేషన్‌లు ఫిబ్రవరి 1న జరిగాయి. అందువల్ల ఆ తేదీ.. వారాంతంలో వచ్చినప్పటికీ మార్కెట్లు ట్రేడింగ్ కోసం తెరిచి ఉంటాయి. అయితే.. ఆదివారం సెటిల్‌మెంట్ హాలిడే కాబట్టి.. జనవరి 30న కొనుగోలు చేసిన షేర్లను ఫిబ్రవరి 1న అమ్మడానికి కుదరదు. అలాగే.. బడ్జెట్ రోజున కొనుగోలు చేసిన స్టాక్‌లను మరుసటి రోజు ఆఫ్‌లోడ్ చేయటానికి లేదు.
