Homeనల్లగొండBhukya Raju Naik | అట్రాసిటీ కేసుతో బాధిత పిల్లలకు భరోసా కల్పించాలి

Bhukya Raju Naik | అట్రాసిటీ కేసుతో బాధిత పిల్లలకు భరోసా కల్పించాలి

  • లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, భూక్య రాజు నాయక్

ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దంపతుల హత్య ఘటనలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్య రాజునాయక్ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోతే మండలంలో ఎస్టీ దంపతులు దారుణ హత్యకు గురికావడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.

నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ స్పందించిన తీరు అభినందనీయమన్నారు. అయితే బాధితులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినందున ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేయాలని కోరారు.
అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం ద్వారా బాధిత దంపతుల పిల్లలకు చట్టపరమైన భరోసా, ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుందని అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవిష్యత్తును ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి వారి కుటుంబానికి జీవనాధారం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి తగిన పరిహారం, పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించాలని కోరారు. బాధిత కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు లంబాడి హక్కుల పోరాట సమితి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News