మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన మర్కస్ మస్జిద్ కమిటీ మాజీ అధ్యక్షుడు,బీఆర్‌ఎస్ యువ నాయకుడు పఠాన్ హఫీజ్ ఖాన్ కుటుంబంలో ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంఘటన తెలిసిందే. ఈ సందర్భంగా హుజూర్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి శనివారం ఆయన స్వయంగా హఫీజ్ ఖాన్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.(Condolence) హఫీజ్ ఖాన్ భార్య షకీలా మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో హుజూర్ నగర్ మాజీ జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి,నేరేడుచర్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకటరెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకులు డాక్టర్ కేఎల్‌ఎన్ రెడ్డి, మఠంపల్లి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, నియోజకవర్గ నాయకులు చెన్నబోయిన సైదులు, పచ్చిపాల ఉపేందర్, గ్రామ సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి, మర్కస్ మసీదు కమిటీ అధ్యక్షుడు షేక్ ఇస్మాయిల్, సుల్తాన్ పూర్ తండ సర్పంచ్ హరిచంద్ర నాయక్,మండల నాయకులు కోటానాయక్, ఇరిగల వెంకటరెడ్డి, పరాశరం అయ్యప్ప, బేత శివారెడ్డి, వీరమల్ల సుందరయ్య, మిర్చి సుభాని, పిండిప్రోలు రామచంద్రయ్య, గువ్వల వీరయ్య, ఆవుల వెంకటయ్య, చిన్నపంగు రాజీవ్, బాలు నాయక్, గుండెపంగు సురేష్, మట్టపల్లి, బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
