Homeనల్లగొండMy Home Industries | పర్యావరణ పరిరక్షణతోనే మానవ జాతికి మనుగడ

My Home Industries | పర్యావరణ పరిరక్షణతోనే మానవ జాతికి మనుగడ

మేళ్లచెరువు: పర్యావరణ పరిరక్షణతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిమెంట్ వర్క్స్ జనరల్ మేనేజర్ (ఇండస్ట్రీస్) ఎం.ఏ.భారతి అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షించాలని ఆమె పిలుపునిచ్చారు.గురువారం మై హోమ్ సిమెంట్ పరిశ్రమ ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ మేనేజర్ (My Home Industries) ఎం.ఏ. భారతి, యూనిట్ హెడ్ ఎన్. శ్రీనివాసరావు హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఫ్యాక్టరీ ప్రాంగణంలో అధికారులు, సిబ్బంది, కార్మికులతో పెద్ద ఎత్తున మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా జియం భారతి మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమం ద్వారా పరిశ్రమలో పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు.

- Advertisement -

మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.అలాగే ‘స్వచ్ఛతా హి సేవా’ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పరిశ్రమ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు, సిబ్బంది, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎ&డి జియం శ్రీరామ్, ఎజియం సుబ్రమణ్యం,సంస్థ ఉన్నతాధికారులు,సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News