Homeకెరీర్ న్యూస్SSC Results | వాట్సాప్ లో టెన్త్ రిజల్ట్స్..

SSC Results | వాట్సాప్ లో టెన్త్ రిజల్ట్స్..

  • అందుబాటులోకి తెచ్చిన ఎస్సెస్సీ బోర్డు..

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఈ ఏడాది వాట్సాప్‌లోనూ తెలుసుకోవచ్చు. ఎస్సెస్సీ బోర్డు ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే హాల్‌టికెట్లను సైతం వాట్సాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకొనే వెసులుబాటు కల్పించిన బోర్డు తాజాగా ఫలితాలను సైతం వాట్సాప్‌ ద్వారా తెలుసుకొనే వీలు కల్పించింది. వాట్సాప్‌ ద్వారా హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకొన్న వారి మొబైల్‌ నంబర్‌కు ఆటోమెటిక్‌గా మెమో వెళుతుంది.

డౌన్‌లోడ్‌ చేసుకోని వారు మాత్రం.. 80969 58096 నంబర్‌కు ‘హాయ్‌’ అని సందేశం పంపించాలి. ఆ తర్వాత ఎస్సెస్సీ రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదుచేయాలి. ఆ తర్వాత ఫలితం స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం ఈ నెల 23తో ముగియనున్నది. మే 4, 5 తేదీల్లో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News