Homeస్పోర్ట్స్Sri Lanka | రెండో టెస్ట్ కోసం శ్రీలంక భారీ మార్పులు..

Sri Lanka | రెండో టెస్ట్ కోసం శ్రీలంక భారీ మార్పులు..

  • 14 మందితో కూడిన జట్టు ప్రకటన..
  • అయిదుగురు ఆటగాళ్లను తప్పించిన వైనం..

భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన శ్రీలంక, రెండో టెస్టు కోసం తమ జట్టులో భారీ మార్పులు చేసింది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుతో ఆదివారం కొలంబోలో ప్రారంభంకానున్న చివరి టెస్టు కోసం 14 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. ఈ జట్టు నుంచి ఐదుగురు ఆటగాళ్లను తప్పించి, దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఇద్దరు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. ఆల్ రౌండర్ సహన్ అరాచ్చిగే, బ్యాటర్ కమిల్ మిషారాలు తొలిసారిగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.

గాలేలో జరిగిన తొలి టెస్టులో గాయపడిన సీనియర్ ఆటగాడు దినేశ్‌ చండిమాల్ రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా అరంగేట్రం చేసిన పసిందు సూరియబండార, తాను ఆడిన ఏకైక ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడంతో అతనిపైనా సెలక్టర్లు వేటు వేశారు. వీరితో పాటు ఓపెనర్ నిషాన్ మదుష్క, బౌలింగ్ ఆల్ రౌండర్ రమేశ్‌ మెండిస్, ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మదుష్కలను కూడా జట్టు నుంచి తప్పించారు. ఇటీవల భారత్-ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో శ్రీలంక-ఏ జట్టుకు నాయకత్వం వహించి అద్భుత ప్రదర్శన చేసిన సహన్ అరాచ్చిగేకు సెలక్టర్ల నుంచి పిలుపు అందింది.

- Advertisement -

ఆ సిరీస్‌లో అతను రెండో మ్యాచ్‌లో 127 పరుగులు, తొలి మ్యాచ్‌లో 72 పరుగులు సాధించాడు. మొత్తం రెండు మ్యాచ్‌లలో 209 పరుగులతో తన జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు, బ్యాటర్ కమిల్ మిషారా కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్‌) 2026 సీజన్‌లో 9 ఇన్నింగ్స్‌లలో 411 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇందులో గాలే గ్యాలంట్స్‌పై సాధించిన సెంచరీ కూడా ఉంది. అంతేగాక మేజర్ క్లబ్స్ టీ20 టోర్నీలో గురువారం కేవలం 72 బంతుల్లో 145 పరుగులు బాది తన విధ్వంసకర ఫామ్‌ను చాటుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News