Homeహైదరాబాద్‌SIR | అర్హుల ఓట్లు తొలగించొద్దు అన్ని జాగ్రత్తలు తీసుకోండి

SIR | అర్హుల ఓట్లు తొలగించొద్దు అన్ని జాగ్రత్తలు తీసుకోండి

  • పద్మారావు గౌడ్
  • ఎస్‌ఐఆర్ కేంద్రాల పరిశీలన.. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచన

ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అన్ని సౌకర్యాలు కల్పించాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు.గురువారం మెట్టుగూడ,బౌద్ధనగర్ డివిజన్ల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలు, ఎస్‌ఐఆర్ సహాయ కేంద్రాలను ఆయన పరిశీలించారు.డీబీఆర్ గల్లీ,పాండవ బస్తీ,దూద్‌బావి,చింతాబావి,పార్సీగుట్ట తదితర ప్రాంతాల్లో పర్యటించి దరఖాస్తుల స్వీకరణను పరిశీలించారు.

అర్హులైన ఒక్కరి ఓటు కూడా తొలగిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి సీతాఫలమండి కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రాసురి సునీత, కంది శైలజ,బీఆర్‌ఎస్ యువ నాయకులు తీగుళ్ల కిశోర్ కుమార్,సమన్వయకర్త రాజా సుందర్, సికింద్రాబాద్ బౌద్ధ నగర్ సీనియర్ లీడర్ సుంకు రామచందర్,బీఎల్‌వోలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News