Homeఆదాబ్ ప్రత్యేకంSerilingampally | అనుమతులు లేవు.. చర్యలు లేవు..

Serilingampally | అనుమతులు లేవు.. చర్యలు లేవు..

ముడుపులు ఇచ్చుకో.. అక్రమ నిర్మాణం కట్టుకో..!

  • సైబరాబాద్ పరిధిలో ‘అక్రమ’ సామ్రాజ్యం..
  • నిబంధనలను తుంగలో తొక్కి స్టిల్ట్ + 7 నిర్మాణం!
  • నాలుగు నెలలైనా స్పందన కరువు
  • టౌన్ ప్లానింగ్ మౌనం ఎందుకు?
  • చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం..

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలం, పన్ ముక్తా గ్రామంలోని సర్వే నెం. 5/3లో జరుగుతున్న భారీ అక్రమ నిర్మాణాన్ని చూస్తుంటే, అక్రమ కట్టడాల మాఫియాకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

అనుమతులు లేవు.. ఆకాశమే హద్దు!

ఈ నిర్మాణం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఎటువంటి చట్టబద్ధమైన భవన అనుమతులు లేకుండా, నిబంధనలకు పాతర వేస్తూ స్టిల్ట్ + 7 అంతస్తుల (అంటే కింది భాగంలో వాహనాల పార్కింగ్ మరియు పైన ఏడు అంతస్తుల) భారీ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణం హెచ్. ఎమ్.సి యాక్ట్ 1955 నిబంధనలను, సెట్బ్యాక్ (భవనం చుట్టూ వదలాల్సిన స్థలం) నిబంధనలను, మరియు కనీస భద్రతా ప్రమా ణాలను పూర్తిగా ఉల్లంఘిస్తోందని ఫిర్యాదుదారు వాపోతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు..

ఈ అక్రమ నిర్మాణంపై ఈ ఏడాది మార్చి 4న సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆధారాలతో, ఫోటోలతో కూడిన ఫిర్యాదు అందినప్పటికీ, నాలుగు నెలలు గడిచినా అధికారులు స్పందించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫిర్యాదు అంది నాలుగు నెలలు దాటినా, కనీసం ఒక తనిఖీ నిర్వహిం చకపోవడం, నిర్మాణాన్ని ఆపమని నోటీసు (స్టాప్ వర్క్ నోటీసు) జారీ చేయకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలకు దారితీస్తోంది.

శాఖల మధ్య సమన్వయ లోపాన్ని ఆసరాగా చేసుకుని, అక్రమాలను చట్టబద్ధం చేసుకునేందుకు జరుగుతున్న ‘రెగ్యులేటరీ ఆర్బిట్రాజ’ (నిబంధనల మధ్య గల లొసుగులను ఉపయోగించుకోవడం)కు ఇది ఒక నిదర్శనమని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఇది కేవలం మంచుకొండలో కనిపించే చిన్న భాగం (టిప్ ఆఫ్ ది ఐస్ బర్గ్) మాత్రమేనని, దీని వెనుక ఇంకా పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘనలు మరియు అవినీతి జరిగి ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టించుకునే నాథుడే లేరా?

అధికారుల మౌనం, నిర్మాణదారులకు వరంగా మారింది. ఎటు వంటి అనుమతులు లేకపోయినా, అధికారుల నుంచి చర్యలు లేకపోవడంతో నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇది ప్రజల భద్రతను పణంగా పెట్టడమే కాకుండా, నగర ప్రణాళికను అపహాస్యం చేసేలా ఉందని స్థానికులు మండిపడుతున్నారు.

అక్రమ కట్టడాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్న అధికారులు, ఈ వ్యవహారంలో తమ బాధ్యతను విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికా రులు స్పందించి, వెంటనే క్షేత్రస్థాయిలో నిర్మాణ స్థలాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాలని, హెచ్.ఎమ్.సి యాక్ట్ 1955 నిబంధనల ప్రకారం నిర్మాణ పనులను నిలిపివేస్తూ స్టాప్ వర్క్ నోటీసు జారీ చేయడమే కాకుండా, అక్రమ నిర్మాణాన్ని చట్టపరం గా కూల్చివేయాలని ఫిర్యాదుదారు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కొనసాగుతున్న ఈ అక్రమ కట్టడాలపై వారు ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News