- ఒక అకడమిక్ టర్మ్ లో ఒక్కసారే టాయిలెట్ కు..
- ఈ కఠిన రూల్ పై విమర్శల వెల్లువ..
దక్షిణ చైనాలోని ఓ సెకండరీ పాఠశాల ప్రవేశపెట్టిన ఓ వింత నిబంధన తీవ్ర వివాదాస్పదంగా మారింది. రెగ్యులర్ టాయిలెట్ బ్రేక్ కాకుండా… ఒక అకడమిక్ టర్మ్ మొత్తంలో విద్యార్థులు క్లాస్ జరుగుతున్నప్పుడు అత్యవసరమైతే కేవలం ఒక్కసారి మాత్రమే టాయిలెట్‌కు వెళ్లాలని ఆ నిబంధన చెబుతోంది. ఈ కఠినమైన రూల్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు(Toilet Controversy) వెల్లువెత్తడంతో స్థానిక విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని రుయువాన్ కౌంటీ హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు చివరిలో స్కూల్ యాజమాన్యం నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఈ నిబంధనను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ ప్రజెంటేషన్‌ను ఓ టీచర్ ఫొటో తీయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ నిబంధన ప్రకారం.. క్లాస్ లేదా సెల్ఫ్-స్టడీ సమయంలో విద్యార్థులు టాయిలెట్ కోసం బయటకు వెళ్లడంపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి.
ఒకవేళ విద్యార్థి రెండోసారి టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే, వారి తల్లిదండ్రులను స్కూల్‌కు పిలిపించి ‘జాయింట్ ఎడ్యుకేషన్’ పేరుతో చర్చలు జరుపుతారు. మూడోసారి కూడా నిబంధన ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అయితే, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది స్పష్టంగా వెల్లడించలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
