Homeరంగారెడ్డిSomnath Temple | భారత దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక సోమనాథ్ దేవాలయం

Somnath Temple | భారత దేశ ఆత్మ గౌరవానికి ప్రతీక సోమనాథ్ దేవాలయం

భారత దేశ ఆత్మగౌరవానికి, సౌభ్రాతృత్వానికి, లౌకికతకు సోమనాథ్ దేవాలయం ప్రతీక అని జవహర్ నగర్ బిజెపి పశ్చిమ శాఖ అధ్యక్షుడు కలికోట కమలాకర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్ సూచన మేరకు కలికోట కమలాకర్ ఆధ్వర్యంలో శనివారం జవహర్ నగర్ స్థానిక శివాలయంలో అభిషేకాలు నిర్వహించి శివునికి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో సోమనాథ్ దేవాలయ పునరుద్ధరణ జరిగిందని, 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షంలో ప్రాణ ప్రతిష్ట జరిగిందని గుర్తు చేశారు. ఆ పునరుద్ధరణకు 2026 నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇవి సర్వ మానవ సౌభ్రాతృత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు.

- Advertisement -
Somnath Temple Symbol of India0

భారతదేశం సార్వభౌమ, గణతంత్ర, లౌకిక దేశమని, ప్రజలంతా సోదర భావంతో ఐక్యమత్వంతో మెలుగుతున్నారని చెప్పారు. భారతదేశం ప్రపంచానికి వెలుగు చూపుతున్న గొప్ప శక్తిగా ఎదుగుతోందని, భారతీయులు గుణంలో, సేవాభావంలో శక్తివంతులని వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నట్లుగా సోమనాథ్ ఒక దేవాలయం మాత్రమే కాదని, అది భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు సంతోష్ గుప్తా, మహేందర్ యాదవ్, కుర్ర పుణ్యరాజు, మరాటి బాబు, లిఖిత యాదవ్, మాధవి, చంద్రమౌళి, రామ్ నాయక్, వేపుల సన్నీ, రాజు, శ్రవణ్ కుమార్, రాఘవేంద్ర చారి, లక్ష్మిరెడ్డి, భవాని, ఝాన్సీ, సంజీవ్ గౌడ్, శివ ప్రసాద్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News