Homeనల్లగొండShivaganga Lift Irrigation | ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రాధాన్యత

Shivaganga Lift Irrigation | ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రాధాన్యత

చింతలపాలెం: శివగంగ ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలోని 13,300 ఎకరాల్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా రైతు కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని పథకం చైర్మన్ గుడిసె వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం చింతలపాలెం మండలంలోని పిక్లా నాయక్ తండాలో శివగంగ రైతు కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృషితో చింతలపాలెం మండలంలో శివగంగ ఎత్తిపోతల పథకం(Shivaganga Lift Irrigation) నిర్మాణం జరగడం రైతులకు ఎంతో ప్రయోజనకరమన్నారు.ఎంతో శ్రమకోర్చి నిర్మించిన ఈ పథకాన్ని రైతులందరూ ఐకమత్యంతో కాపాడుకోవాలని సూచించారు.

మోటార్లు, లిఫ్ట్‌ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రత్యేకించి చివరి ఆయకట్టు వరకు సాగునీరు చేరేలా కమిటీ సభ్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ రైతుల మధ్య సమన్వయం కొనసాగించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కందుల ముక్కంటి, సర్పంచ్ లకావత్ సైదులు,నాయకులు మల్రెడ్డి నరసింహారెడ్డి, నరేష్, శివగంగ లిఫ్ట్‌(Shivaganga Lift Irrigation) రైతు కమిటీ సభ్యులు,స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News