Thursday, May 21, 2026
Homeరంగారెడ్డిShadnagar MLA | సమస్యలను తీర్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.

Shadnagar MLA | సమస్యలను తీర్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం.

  • షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.
  • తండాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం.
  • జర్నలిస్టులు నిర్మోహమాటంగా సమస్యలను ఎత్తిచూపండి.
  • ఎమ్మెల్యే శంకరన్నకు రుణపడి ఉంటాం.
  • సిడి తండా సర్పంచ్ గబ్రు చౌహన్.

గ్రామాల్లోని ప్రజా సమస్యలను తీర్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. నందిగామ మండలము చాకలిగుట్ట తండా పరిధిలోని అయ్యప్ప టెంపుల్ (రెడ్డి) కాలనిలో బుధవారం సర్పంచ్ గబ్రు చౌహన్ ఆధ్వర్యంలో సుమారు 30 లక్షల రూపాయల డిఎంఎఫ్టి నిధులతో నూతనంగా వేయనున్న అండర్ డ్రైనేజీ పైపులైన్ పనులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్య అతిథులుగా హాజరై, మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు నచ్చి, మెచ్చి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ లక్ష్యమని అన్నారు. తండాలను కూడా అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఒక్కొక్కటి అభివృద్ధిని ప్రణాళిక బద్దంగా అమలు చేస్తున్నామని అన్నారు.ప్రజలు ఆశీర్వదిస్తేనే మనం ఈ స్థాయిలో ఉన్నామని ఈ విషయాన్ని మరచిపోవొద్దన్నారు.ఒక ప్రజా ప్రతినిధి అవ్వడం అంటే ఒక గౌరవప్రదమైన భాధ్యతను చేపట్టడమన్నారు.

- Advertisement -

ప్రజాప్రతినిధులు అధికారములోకి రాకముందే రాజకీయాలు చేయాలని వచ్చాక అన్ని పార్టీల నాయకులు, సొంత పార్టీల నాయకులను కలుపుకుని ముందుకు వెళ్లాలన్నారు. అందరిని గౌరవిస్తూ, ప్రజలతో మమేకమవుతూ సమస్యలను పరిష్కరించాలని అన్నారు.కేవలం ఎన్నికలప్పుడే పార్టీలని,ఆ తర్వాత అందరం ఒక్కటేనని ప్రజాప్రతినిధులకు సూచించారు.

సమస్యలను ఎత్తి చూపండి.

ప్రధానంగా పత్రికలు సమస్యలను ఎత్తిచూపడానికే ఉన్నాయని, జర్నలిస్టులు సమస్యలను వెలుగులోకి తెస్తూ వార్తలు ప్రచురిస్తే, ఆ విషయాన్ని పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని,ఎవ్వరిని తప్పుబట్టోదని, విద్వేషాలకు వెళ్లడం, దూషించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే తెలిపారు. ఒక సమస్యను మన దృష్టికి తేవాలంటే జర్నలిస్టులు తమ పత్రికల్లో ప్రచురించాల్సిందేనని, అందుకు ఒక ప్రజాప్రతినిధిగా మనం ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ఆ సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో జర్నలిస్టులు ప్రజా సమస్యలపై నిర్భయంగా వార్తలు రాయాలని అప్పుడే అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా పని చేస్తారని తెలిపారు.

ఎమ్మెల్యేకు రుణపడి ఉంటాం – సర్పంచ్ గబ్రు చౌహన్.

గత 20యేండ్లుగా అభివృద్ధికి నోచుకోని అయ్యప్పటెంపుల్ (రెడ్డి) కాలనీకి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న సహకారంతో అభివృద్ధి వైపు అడుగులు వేయడం చాలా సంతోషంగా ఉందని సిడి తండా సర్పంచ్ గబ్రు చౌహన్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఇలా సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దగ్గరికి వెళ్ళగానే సానుకూలంగా స్పందించి సుమారు 30లక్షల రూపాయలతో శాశ్వత అండర్ డైనేజి వ్యవస్థను ఏర్పాటు చేయడం ఎప్పటికి గుర్తుండిపోయే విషయమన్నారు.ఎల్లప్పుడూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి మా గ్రామం తరపున రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News