Homeసాహిత్యంMindscape | కూపస్థ మండూకం

Mindscape | కూపస్థ మండూకం

అక్వేరియం మాయాలోకంలో చేపలు
కూపస్థ మండూకంలో జలపుష్పాలు
గాజు గోడలే సువిశాల సాగర ప్రపంచం..
ఒకరు విసిరిన మెతుకులే పరమాన్నం
కొద్ది చేప పిల్లలే ఇరుగుపొరుగులు
బయటకు వెళ్లే మార్గాలు కరువు
యజమానుల మెప్పుకు సంబురంగా..
మూరెడు జాగలో అలుపెరుగని పరుగులు
ఇదే కదా అక్వేరియం చేపల దుర్గతి !

అక్వేరియం బతుకైంది..
నవ్య నరుడి డిజిటల్ జీవితం
కుల గజ్జి పట్టిన వేర్పాటు తెగుళ్లు
మతాలను వేరు చేస్తున్న అడ్డు గోడలు
ఒంటరిగా నెట్టింట్లో స్మార్ట్ తెరల మునకలు
ధనస్వామ్యంలో ఆస్తులు అంతస్తుల వర్గాలు
అభద్రతా వలలో విలవిల్లాడుతున్న పేదలు
తోలు రంగు చూసి మాట మర్యాదలు
వస్త్రధారణకే పెరుగుతున్న మర్యాదలు
అందనంత దూరాన సమన్యాయ తీరాలు !

- Advertisement -
RELATED ARTICLES

Latest News