మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని వాణి నగర్‌లో సంతోషి డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రులది కీలక పాత్ర ఉందని, సంతోషి డెంటల్ ఆసుపత్రి ప్రారంభం వాణి నగర్, పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. స్థానిక యువ వైద్యులు ప్రజల ఆరోగ్య సేవల కోసం ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.కార్యక్రమంలో డాక్టర్ సంతోషి , డాక్టర్ సిద్ధార్థ వర్మ ,కృష్ణ చావ్లి, ప్రవీణ్, కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికలు తదితరులు పాల్గొన్నారు.
డెంటల్ ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి..
RELATED ARTICLES
- Advertisment -
