రైతులకు అందుబాటులోకి తెచ్చిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఖానాపూర్ (Khanapur) పట్టణంలోని మార్కెట్ యార్డ్(Market Yard)లో PACS ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని (Rice purchasing center) ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారుల(Brokers)ను నమ్మి రైతులు (Farmers) మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర(Minimum Support Price)తోపాటు రూ.500 బోనస్(Bonus) అందిస్తుందని చెప్పారు. నిర్వాహకులతో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
