ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా
దెబ్బతిన్న పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని
మొంథా తుఫాన్ (Cyclone) ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలతో వేలాది ఎకరాల పంటలు దెబ్బతిని రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని, పంటల నష్టంపై సర్వే చేపట్టి నివేదిక అందించాలని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే (Kothagudem Mla) కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) అన్నారు. సుజాతనగర్ (Sujatha Nagar) మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి జరిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వదల కారణంగా జరిగిన పంటల నష్టంపై యుద్ధప్రాతి పది కన సర్వే చేపట్టి పూర్తిచేయాలని, నష్టనివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం (Compensation) కోసం ఒత్తిడి తెస్తానని తెలిపారు. జరిగిన నష్టంపై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు స్పందించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, విద్యుత్ పునరుద్ధరణ పనులు తక్షణమే పూర్తి చేయాలని, ఇళ్లు కోల్పోయిన నిరాశ్రయులైన పేదలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట సాబీర్ పాషా, తహశీల్దార్ కృష్ణప్రసాద్, ఎంపిడిఓ బారతి, వ్యవసాయశాఖాధికారిని నర్మదా, నాయకులు సీతారాములు, హన్మంతరావు, సలిగంటి శ్రీనివాస్, భూక్యా దస్రు, హన్మంతరావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
