Wednesday, January 14, 2026
EPAPER
Homeఆదాబ్ ప్రత్యేకంSankranti | పండుగల్లో సంక్రాతిది ఎంతో ప్రత్యేక స్థానం..

Sankranti | పండుగల్లో సంక్రాతిది ఎంతో ప్రత్యేక స్థానం..

భారతీయ సంస్కృతిలో పండుగలకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ పండుగలలో సంక్రాంతి ఒక ప్రధానమైనది. ప్రకృతితో, వ్యవ సాయంతో మన జీవితం ఎంతగా ముడిపడి ఉందో గుర్తు చేసే పండుగే సంక్రాంతి. రైతుల కష్టానికి ఫలితం దక్కే ఈ సమ యంలో, గ్రామాలు, నగరాలు అన్నీ పండుగ శోభతో ఉట్టిపడు తుంటాయి. సంక్రాంతి రాగానే ప్రతి ఇల్లు శుభ్రతతో మెరిసి పోతుంది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గోబ్బిళ్లతో అలంకరించిన ద్వారాలు ఎంతో అందంగా కనిపిస్తాయి.

కొత్త బట్టలు, కొత్త పాత్రలు కొనడం, ఇళ్లకు రంగులు వేయడం ఈ పండుగ ప్రత్యేకత. తెల్లవారుజామున గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలు వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా మార్చేస్తాయి. భోగి పండుగతో సంక్రాంతి వేడుకలు ప్రారంభమవుతాయి. భోగి మంటల చుట్టూ కుటుంబ సభ్యులు చేరి పాతవి విడిచి, కొత్త ఆశలను ఆహ్వానిస్తారు. మరుసటి రోజు వచ్చే మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో, శుభారంభానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

- Advertisement -

ఆ రోజు పొంగలి, పులిహోర, అరిసెలు వంటి సాంప్రదాయ వంటకాలతో ఇళ్లు సువాసనలతో నిండిపోతాయి. సంక్రాంతి శోభలో ముఖ్య మైనది పల్లె వాతావరణం. ఎద్దుల పందాలు, కోడి పందాలు, గాలిపటాల పోటీలు పండుగకు మరింత ఉత్సాహాన్ని తీసు కొస్తాయి. పిల్లలు గాలిపటాలతో ఆకాశాన్ని నింపితే, పెద్దలు ఆనం దంగా ఆ ఆటలను వీక్షస్తారు. బంధువులు, స్నేహితులు కలుసు కుని శుభాకాంక్షలు చెప్పుకోవడం ఈ పండుగ అందాన్ని మరింత పెంచుతుంది. సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు.. అది మన సంస్కృతి, సంప్ర దాయాలు, కుటుంబ అనుబంధాలను గుర్తు చేసే మహోత్సవం.

ఆనందం, ఐక్యత, కృతజ్ఞతలతో నిండిన సంక్రాంతి శోభ మన హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. చలికాలపు ఉదయాలు, ముంగిట్లో ముగ్గుల మెరుపులు, గాలిలో తీయని పొంగలి వాసన.. ఇవన్నీ కలిసిన ప్పుడే సంక్రాంతి శోభ పరిపూర్ణమవుతుంది. ప్రకృతి సైతం పసిడి పంటలతో నవ్వుతూ రైతుకు కృతజ్ఞతలు తెలుపుతుంది. భోగి మం టల చుట్టూ కుటుంబం చేరి ఆనం దాన్ని పంచు కుంటుంది. ఆకాశంలో విహ రించే గాలిపటాలు పిల్లల కలలకు రెక్కలు ఇస్తాయి. పల్లెల్లో వినిపించే పాటలు, ఆటలు సంక్రాం తిని ఒక ఉత్సవంగా మలుస్తాయి. ఇలా సంక్రాంతి శోభ మన సంస్కృతికి అద్దం పడు తూ, తరతరాలకు ఆనందాన్ని అందిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News