టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డేల్లో (OneDay) నంబర్ వన్ ర్యాంక్(Number-1)ను సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour)లో ఇచ్చిన అద్భుతమైన ప్రదర్శనతో 781 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ (ICC) ర్యాంకుల్లో అగ్రస్థానానికి వచ్చాడు. దీంతో ఇప్పటిదాక ఈ ప్లేస్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌గిల్(Shubman Gill) మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. అఫ్ఘానిస్థాన్ (Afghanistan) ఆటగాడు ఇబ్రహీం జద్రాన్(Ibrahim Zadran) 764 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో అఫ్ఘాన్ ప్లేయర్ రషీద్ ఖాన్(Rashid Khan) టాపర్‌గా నిలిచాడు. ఆల్‌రౌండర్ విభాగంలో కూడా అఫ్ఘాన్ క్రీడాకారుడే (అజ్మతుల్లా ఒమర్జాయ్‌దే) నంబర్ వన్ అయ్యాడు.
- Advertisment -
