Wednesday, December 10, 2025
EPAPER
Homeవరంగల్‌Revanth Reddy | రవ్వంత జాలి చూపు రేవంతన్న

Revanth Reddy | రవ్వంత జాలి చూపు రేవంతన్న

వరంగల్ జిల్లా నర్సంపేట కు చెందిన తెలంగాణ అమరవీరుడు తోగటి రాజుకుమార్ చారి తల్లి జయమ్మ. తన దీన పరిస్థితి ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీంచాలని వేడుకుంటున్నది. చెట్టంత కొడుకు ఉద్యమం లో పాల్గొని ఆత్మహుతికి పాల్పడి తమను అనాదులుగా చేయగా కొంత కాలానికి భర్త సదానందచారి. కాలం చేయడంతో మరింత బాదలను ఎదుర్కొంటున్నట్లు జయమ్మ తెలిపారు మరో కోడుకు.

అనారోగ్యంతో మంచాన పడిపోయాడని,గత నలబై సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో ఉంటూ కూలి చేసుకుంటూ పూటగడుపుకుంటున్నట్లు ఆమె తెలిపారు. నర్సంపేట కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా తనబాధలు వివరిస్తూ తనకు స్వంత భూమి గాని స్వంత జాగ గాని లేవని కనీసం పెన్షన్ కూడా లేక నానా కష్టాలు పడుతూ జీవచ్చవంలా బతుకీడుస్తున్నాని కన్నీటి పర్యంతం అయ్యారు. తననుకష్టాల నుండి గట్టెక్కించాలని ముఖ్యమంత్రి ని జయమ్మ వేడుకుంటున్నది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News