Homeబిజినెస్Post Office Retirement Income| రిటైర్డ్ తరువాత ఆర్ధిక భద్రత..

Post Office Retirement Income| రిటైర్డ్ తరువాత ఆర్ధిక భద్రత..

  • పోస్టాఫీస్ పథకాలు ఎంతో ఉపయోగం..Post Office Retirement Income
  • మంత్లీ ఇన్కమ్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం..

పదవీ విరమణ తర్వాత ఆర్ధిక భద్రత పొందేందుకు తాము కూడబెట్టిన డబ్బులను సురక్షితంగా ఉండేలా చూసుకోవడమే అవసరం. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో దాచుకోకుండా పెట్టుబడుల రూపంలో వివిధ పథకాల్లో పొదుపు చేసుకోవడం వల్ల రెట్టింపు ఆదాయం పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడి కోసం పోస్టాఫీస్ పథకాలు బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న పథకాల్లో పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ బాగా ప్రజాదరణ పొందాయి.

భార్య, భర్త ఇద్దరూ ఇందులో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఈ రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ రూపంలో ఎక్కువ పొందవచ్చు. ఈ పథకంలో 60 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ప్రస్తుతం వడ్డీ రేట్లు 8.2 శాతంగా ఉంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో భార్యాభర్తలు చెరొక ఖాతా ఇందులో తెరవొచ్చు. ఇద్దరూ కలిసి రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. 8.2 శాతం వడ్డీ రేటుతో భార్యాభర్తలిద్దరూ సంవత్సరానికి చెరో రూ. 2,46,000 సంపాదిస్తారు.Post Office Retirement Income

- Advertisement -

దీని ఫలితంగా వారి ఉమ్మడి వార్షిక ఆదాయం రూ. 4,92,000 అవుతుంది. ఎస్.సి.ఎస్.ఎస్. కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. దంపతులు ప్రతి త్రైమాసికంలో మొత్తం రూ. 1,23,000 అందుకుంటారు. దీని సగటు నెలవారీ ఆదాయం రూ. 41,000 అవుతుంది. నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ పథకం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు జమ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు జమ చేయవచ్చు.Post Office Retirement Income

భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే 7.4 శాతం వడ్డీ రేటుతో సంవత్సరానికి రూ.1,11,000 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని 12 నెలల పాటు విభజిస్తే.. నెలకు రూ.9,250 ఆదాయం వస్తుంది. ఒకవేళ భార్యాభర్తలు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో రూ.60 లక్షలు, పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం రూ.75 లక్షల పెట్టుబడి అవుతుంది. ఈ విధంగా మొత్తం రూ. 75 లక్షల పెట్టుబడిపై ఏడాదికి రూ. 6,03,000 వడ్డీ లభిస్తుంది. దీనిని 12 నెలల పాటు పంపిణీ చేస్తే సగటున నెలకు రూ. 50,250 ఆదాయం వస్తుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News