కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) మన దేశం(India)లో వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా 2025 డిసెంబర్ (December) 26న ఖమ్మంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ(Meeting)ను ఏర్పాటుచేసింది. ఈ మేరకు సీపీఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (Telangana State Council) నిర్ణయం తీసుకుంది. హలో కామ్రేడ్(Hello Comrade).. ఛలో (Chalo) ఖమ్మం.. అంటూ పిలుపునిచ్చింది. భారత గడ్డపై సీపీఐ.. పీడిత జనపక్షం తరఫున నిలబడి, ఎరుపెక్కిన వందేళ్ల మహావృక్షం(Great Tree)లా ఎదిగిందని పేర్కొంది.

