HomeసినిమాRanabaali | "రణబాలి" మూవీ నుంచి మ్యారేజ్ సాంగ్ రిలీజ్

Ranabaali | “రణబాలి” మూవీ నుంచి మ్యారేజ్ సాంగ్ రిలీజ్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన వారి పెళ్లి వేడుక గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ “రణబాలి” మూవీ టీమ్ ఈ చిత్రంలోని బ్యూటిఫుల్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీలో విజయ్ రణబాలిగా, రశ్మిక జయమ్మ పాత్రల్లో కనిపించనున్నారు.

“రణబాలి”లో వీరి పెళ్లి వేడుక సందర్భంగా ఓ అందమైన పాట చిత్రీకరించారు. ఈ పాటలో అప్పట్లో పెళ్లి సందడి ఎంత సంప్రదాయంగా ఉండేదో చూపించారు. పసుపు దంచడం, గోరింటాకు రుబ్బడం, ఎద్దు బండి సవారీలో నూతన వధూ వరులను తీసుకురావడం, అత్తవారింట్లో నవ వధువు శుభప్రదంగా అడుగుపెట్టడం..ఇవన్నీ ఎంతో అందంగా ఈ పాటలో రూపొందించారు.

- Advertisement -
Ranabaali Wedding Song Featuring Vijay Deverakonda and Rashmika1

ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘ఎందయ్య సామీ, ఇంత కాస్తాందీ వెన్నెల, ఊపేస్తావుంది సిత్తరాల ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరు, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరామన్నారా…’ అంటూ సాగుతుందీ పాట. మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ – అతుల్ బ్యూటిఫుల్ గా ఈ పాటను కంపోజ్ చేశారు.

Ranabaali Wedding Song Featuring Vijay Deverakonda and Rashmika2

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. “రణబాలి” సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ అందుకుంది. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది.

నటీనటులు – విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న, ఆర్నాల్డ్ వోస్లూ, తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ – మైత్రీ మూవీ మేకర్స్
సమర్పణ – గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిలింస్
ప్రొడ్యూసర్స్ – నవీన్ యెర్నేని, రవిశంకర్
స్టోరీ, డైరెక్షన్ – రాహుల్ సంకృత్యన్
కో ప్రొడ్యూసర్స్- అనురాగ్ పర్వతనేని, శివ్ చనన
సీఈవో – చెర్రి
మ్యూజిక్ – అజయ్ – అతుల్
డీవోపీ – నీరవ్ షా
రైటర్ – ప్రమోద్ తమ్మినేని
ప్రొడక్షన్ డిజైనర్ – శివం రావు నాగసాని
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్ ఆర్
చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఆర్ చంద్రశేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – చెంబోలు సాయి ఆదిత్య
కొరియోగ్రఫీ – కృతి మహేశ్
కాస్ట్యూమ్ డిజైనర్ – అర్చన రావు
ఆర్ట్ డైరెక్టర్ – విఠల్ కోసనం
వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – సునీల్ రాజు చింత
యాక్షన్ కొరియోగ్రాఫర్స్ – యెన్నిక్ బెన్, ఆండీ లాంగ్ గ్యుయెన్, రాబిన్ సుబ్బు
సౌండ్ డిజైనర్ – రఘునాథ్ కెమిశెట్టి
పబ్లిసిటీ డిజైనర్ – కబిలన్ చెల్లయ్య
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
మార్కెటింగ్ – ఫస్ట్ షో

- Advertisement -
RELATED ARTICLES

Latest News