- ప్రపంచానికి అన్నం పెట్టిన మెతుకుసీమకు పర్యాటక కిరీటం..
- ఎంపీ రఘునందన్‌రావు
- కలెక్టర్‌కు ఎంపీ ప్రశంసల జల్లు
- ప్రపంచస్థాయి గుర్తింపే లక్ష్యం
- కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్: చరిత్రను చాటే ఖిల్లా.. ప్రకృతి పరవశించే అడవులు.. ఆధ్యాత్మికతను పంచే క్షేత్రాలు.. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు.. ఇలా చారిత్రక, ప్రకృతి, సాంస్కృతిక వైభవానికి నెలవైన మెదక్(Medak) ఇప్పుడు ప్రపంచ పర్యాటక పటంపై ప్రత్యేక ముద్ర వేసేందుకు అడుగులు వేస్తోంది. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు పిలుపునిచ్చారు.
ప్రపంచానికి అన్నం పెట్టిన మెతుకు సీమ
ప్రపంచానికి అన్నం పెట్టిన చరిత్ర మెతుకు సీమ మెదక్‌దని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మెదక్ ఖిల్లా, పోచారం అభయారణ్యం, నర్సాపూర్ అర్బన్ పార్క్, ఏడుపాయల వనదుర్గ, మెదక్ చర్చి తదితర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచించారు. నర్సాపూర్ అడవుల అందాలను సినీ పరిశ్రమ సైతం గుర్తించిందన్నారు. టూరిజంతో హోటళ్లు, టూరిస్ట్ గైడ్లు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మెదక్ పర్యాటక(Medak Tourism) ప్రాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసి, పర్యాటకులను ఆకర్షించేలా యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కలెక్టర్‌కు ఎంపీ ప్రశంసల జల్లు
పర్యాటక రంగంలో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి సాధించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను ఎంపీ రఘునందన్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. ఆమె నాయకత్వంలో మెదక్ అభివృద్ధికి కొత్త ఊపు వచ్చిందన్నారు. జిల్లాను ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఆదిలాబాద్, ములుగు జిల్లాలకు దీటుగా మెదక్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
14 ప్రాంతాలతో ప్రత్యేక టూరిజం సర్క్యూట్
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో అపారమైన చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక సంపద ఉందన్నారు. ఈ సంపదను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పర్యాటక సర్క్యూట్ అభివృద్ధి కోసం జిల్లాలో 14 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. మె0దక్ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా లభిస్తాయని పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
