ఎర్రగడ్డ డివిజన్(Erragadda Division)లో అభివృద్ధి పనుల నిమిత్తం జనప్రియ మెట్రోపొలిస్, ఎర్రగడ్డ జేఏసీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth)కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ (JubileeHills Congress Party) అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) మాట్లాడుతూ.. జనప్రియ కాలనీల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడం తన ప్రాధాన్యత అని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ఈ వినతిపత్రంలోని ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలే తన ప్రాధాన్యత, అభివృద్ధే తన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయా డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి, జనప్రియ జేఏసీ ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
- Advertisment -
