పాలమూరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఏ. ఈశ్వర్ కుమార్‌ను ఒప్పంద అధ్యాపకుల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ ఈశ్వర్ కుమార్‌కు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకితభావంతో నిర్వర్తిస్తూ కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అధికారులు, అధ్యాపకులు, విద్యార్థుల మధ్య సమన్వయానికి వారధిగా ఉంటూ కళాశాల విద్యా ప్రమాణాల మెరుగుదలకు, అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఫార్మసీ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్‌గా డాక్టర్ ఏ. ఈశ్వర్ కుమార్‌ను నియమించిన ఉపకులపతి ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ కి , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పూస రమేష్ బాబు కు ఈ సందర్భంగా ఒప్పంద అధ్యాపకుల జేఏసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపక సంఘం నాయకులు డాక్టర్ ఎస్. రవికుమార్, డాక్టర్ కె. శ్రీధర్ రెడ్డి, డాక్టర్ బి. పర్వతాలు, ఏ.సుదర్శన్ రెడ్డి, వి. ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్ ఎన్ అర్జున్ కుమార్, డాక్టర్ ఎం. గాలెన్న, డాక్టర్ వి విజయభాస్కర్, డాక్టర్ చిన్నాదేవి, డా తరుణ్, డా శిలాస్, డా స్వాతి, సుజాత, డాక్టర్ వెంకటేష్, చీప్ వార్డెన్ డాక్టర్ మనేమోనీ కృష్ణయ్య, డాక్టర్ జిమ్మీ కాటన్, డాక్టర్ బి.సోమేశ్వర్, డా ఎం. జ్ఞానేశ్వర్, డా కె. రామ్మోహన్, డా వి. శ్రీనివాస్, పీడీ డా వై. శ్రీనివాస్,డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ బి.సురేష్, డాక్టర్ బి. నాగరాజు, డాక్టర్ ఎం. మధు, చెన్నయ్య, డా శారద, డా సుజాత తదితరులు పాల్గొని నూతన ప్రిన్సిపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారుu
