Thursday, April 23, 2026
Homeక్రైమ్ వార్తలుVC Sajjanar | పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కు పాదం..

VC Sajjanar | పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కు పాదం..

  • హెచ్చరించిన వీసీ సజ్జనార్..

విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయ దుకాణాలపై ఉక్కుపాదం మోపుతున్నామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ వీ.సీ. సజ్జనార్‌ పేర్కొన్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఆపరేషన్‌ సేఫ్‌ స్కూల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో నిబంధనలకు విరుద్థంగా పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 567 దుకాణాలపై కేసులను నమోదు చేసి, సుమారు రూ. 1.10 కోట్ల విలువైన నిషేధిత గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు, పాన్‌మసాలా ఉత్పత్తులను సీజ్‌ చేసినట్లు వెల్లడించారు.

ఆపరేషన్‌ సేఫ్‌ స్కూల్‌ కార్యక్రమం పరిస్థితిని బట్టి నిరంతరం కొనసాగుతుందని సజ్జనార్‌ తెలిపారు. విద్యాసంస్థల సమీపంలో గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సులభంగా లభించడం వల్ల విద్యార్థులు, యువత తొలుత సరదాగా వాటికి ఆకర్షితులవుతున్నారు. ఆ నికోటిన్‌కు క్రమేణా అలవాటు పడి, చివరకు డ్రగ్స్‌, గంజాయి వంటి తీవ్రమైన వ్యసనాల వైపు మళ్లే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఉందని అన్నారు.

- Advertisement -

విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్ట విరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, ఈ-సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్‌ 100కు, హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ న్యూ) ఫోన్‌నంబర్‌ 8712661601కు సమాచారం అందించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News