Homeరంగారెడ్డిOld City Development | పాతబస్తీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Old City Development | పాతబస్తీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • 130 మీటర్ల భూగర్భ మురుగునీటి కాలువ, సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

చంద్రపురి కాలనీ డివిజన్ పరిధిలోని పాతబస్తీలో (Old City Development) 130 మీటర్ల భూగర్భ మురుగునీటి కాలువ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతూ గత పాలకుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగినా పట్టించుకోలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డివిజన్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. డివిజన్ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.

అనంతరం స్థానిక ప్రజలు శ్రీకాంత్ యాదవ్‌ను శాలువాతో సత్కరించి ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధి (Old City Development) పనులు ప్రారంభం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, మాజీ కార్పొరేటర్ నవీన్ కుమార్, సతీష్ గౌడ్, ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అధ్యక్షులు మాట్లా శ్రీనివాస్, నాయకులు రజిత గోపాల్, లత, సునీత, మేరీ, చిట్టిబాబు, అశోక్ గుప్తా, బూడిద వెంకటేష్, సాయి కృష్ణ (మిట్టు), బబ్లూ ముదిరాజ్, కదం రాహుల్, అజయ్ కుమార్, రమేష్ గౌడ్, సదానంద్ కురుమ, ఐలేను, కొమరయ్య, నాగరాజు, అనిల్, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News