Friday, November 14, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంIrregularities | దేవుడి పేరుతో నర్సింగ్ కాలేజీ అక్రమాలు!

Irregularities | దేవుడి పేరుతో నర్సింగ్ కాలేజీ అక్రమాలు!

నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం!
సిలబస్ పూర్తి కాకుండానే సెల్ఫ్ సెంటర్, చూచి రాతల పరీక్షలు..
టీచింగ్ సిబ్బంది లేకున్నా కాలేజీ రెన్యువల్స్
డి.ఎం.ఈ అధికారులకు ముడుపుల మత్తు..
ప్రభుత్వ నర్సులతో టీచింగ్..

నల్గొండ: నర్సింగ్ విద్య (Nursing Education) పేరుతో కొందరు వ్యాపారాలు చేస్తున్న వైనం నల్గొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలో కలకలం సృష్టిస్తోంది. పట్టణ కేంద్రం లోని ఒక బి.ఎస్.సి (BSc) నర్సింగ్ కళాశాల నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల భవితవ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయనే విమర్శలు ప్రముఖంగా వినబడుతున్నాయి. ముఖ్యంగా నల్గొండ పట్టణంలోని ఓ ప్రముఖ వ్యక్తికి చెందిన “వి టి టాకీస్” ప్రాంతంలో నిర్వహించే నర్సింగ్ కళాశాల.. ‘దైవం’ పేరు పెట్టుకొని మరీ విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్న తీరు దారుణం… టి.ఎస్.ఎన్.ఎం.సి (TSNMC), డి.ఎం.ఈ (DME), ఐ.ఎన్. సి (INC) వంటి నియంత్రణ సంస్థలు నిర్దేశించిన కనీస ప్రమాణాలు సైతం ఈ కళాశాల యాజమాన్యం (College Management) పాటించడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. “మమ్ముల్ని ఎవరూ ఏం చేయలేదనే ధీమాతో” ఈ నర్సింగ్ కళాశాల యాజమాన్యం విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నడని విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) ఆరోపిస్తున్నారు.

టీచింగ్ సిబ్బంది కరువు అర్హత లేని బోధన

నర్సింగ్ కళాశాల నియమావళి ప్రకారం 16 నుంది టీచింగ్ సిబ్బంది ఉండాలి. ఎమ్మెస్సీ అర్హతతో 10-15 ఏళ్ల అనుభవం ఉన్న ప్రిన్సిపాల్ తప్పనిసది, కానీ, ఈ కళాశాలలో అర్హత, సీనియార్డ్ లేని సిబ్బందితోనే తరగతులు నడుస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన ఫ్రెషర్స్ తో కేవలం రెండు- మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవారితోనే జె. ఎప్ని, విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లకు వారి అర్హత కు తగిన జీతం ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో వారిని అవసరం లేదంటున్నా కాలేజీ యాజమాన్యం.. ఈ సర్సింగ్ కాలేజీలో ముగ్గురు కెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండాలి కాని నల్గొండ. గవర్నమెంట్ ఇసుపత్రి లో విధులు నిర్వహించే ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్లతో గంటకు 300 రూ. నుంచి 700 రూపాయలు చెల్లిస్తూ
తరగతులు చెప్పిస్తున్నట్లు సమాచారం.

ముడుపుల మత్తులో డి.ఎం.ఈ. అధికారులు..

సిబ్బంది లేకున్నా రెన్యువల్స్. టీచింగ్ సిబ్బంది లేకున్నా, నిబంధనలు గాలికొదిలేసి నర్సింగ్ కళాశాలలు రెన్యువల్స్ అవుతున్నాయంటే… దీని వెనుక డి.ఎం. ఈ అధికారులు ముడుపుల మత్తు ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కాలేజీలో విద్యార్థులు ఉండే హాస్టల్స్లో కనీస వసతులు లేవని, హాస్టల్ కి వైద్యా ఆరోగ్య శాఖధికారి తనిఖీ చేసి ఇచ్చే కానిటేషన్ సర్టిఫికెట్ కూడా లేదని తెలుస్తోంది.. నాణ్యమైన విద్య అందించకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి వెడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కాలేజీ యాజమాన్యం క్లాసులు సరిగా చెప్పకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, పలుసార్లు యాజమాన్యానికి ఫీడ్బ్యాక్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు..

ప్రైవేట్ బస్సుల్లో క్లినికల్స్ …

నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులని హాస్పిటల్స్ కి క్లినికల్స్ కు తీసుకెల్లాలంటే కళాశాలకు సొంత బస్సులు ఉండాలనే నిబంధన ఉన్నా… ఈ కళాశాల యాజమాన్యం ప్రైవేట్ ట్రావెల్కు చెందిన బస్సులను ఉపయోగిస్తోందని, ప్రైవేట్ బస్సుల్లో విద్యార్థులను కుక్కి తీసుకెళ్తున్నారని, “ఏదైనా ప్రమాదం జరిగితే మా పిల్లల జీవితాలు ఏసుపుతాయో” అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమాలకు ‘ఏజెంట్’ కీలక పాత్ర లకల్లో ముడుపులు…?

ఈ అక్రమాల వ్యవస్థ వెనుక ఓ ఏజెంట్ (బ్రోకర్ పాత్ర కీలకంగా ఉందనేది విద్యార్థి సంఘాల ఆరోపణ? ఈ సర్సింగ్ కళాశాలలో ఏ.ఓ. (AO)గా చలామణి అవుతున్న ఈ వ్యక్తి.. అధికారులకు లక్షల్లో ముడుపులు ముట్టజెప్పుతూ కళాశాలలకు అండగా ఉంటున్నాడు. టీచింగ్ సిబ్బంది, రెగ్యులర్ ఫ్యాకల్టీ, ప్రిన్సిపాల్స్ లేకపోయినా.. గత నెలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు లక్షల్లో ముడుపులు ఇచ్చి కళాశాల రెన్యువల్స్ చేయించుకోవడంలో ఈ బ్రోకర్ సఫళీకృతుదయ్యాదని సమాచారం.. ఏ.ఓ. అని చెప్పుకునే ఈ ఏజెంట్.. కె.ఎన్.ఆర్ యూనివర్సిటీ అధికారులను మచ్చిక చేసుకుని, ముడుపులు చెల్లించి, తనకు నచ్చిన వారిని ఇంటర్నల్, ఎక్చర్నల్ ఎగ్జామినర్లుగా నియమించేలా చేయడంలో నెంబర్ వన్ కిలాడి అనే నానుడి ఇతని పై వుంది.

చూసి రాతలు.. సొంత మార్పు అబద్దపు ర్యాంకులు!

ఈ నర్సింగ్ కళాశాల ఆక్రమ బాగోతం కేవలం బోధనలకే పరిమితం కాలేదు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రచారం కూడా అక్రమాలకు అడ్డాగా మారిందని “పరీక్షలన్నీ చూసి రాతలే… ఇంటర్నల్స్ అన్నీ సొంత మార్కులే” అనే ఫార్ములాను అమలు చేస్తున్నారు. ఫైనల్ పరీక్షలకు, ప్రాక్టీ కల్స్కు సైతం ఈ బ్రోకర్ సహకారంతో సెల్ఫ్ సెంటర్లను వేయించు కుం టున్నారు. థియరీ పరీక్షలకు వచ్చిన అబ్జర్వర్లు, ప్రాక్టికల్స్, ఎక్స్టెన్న ల్స్ ను మచ్చిక చేసుకొని.. “ఖరిదైన వస్త్రాలు”, పెద్ద మొత్తంలో డబ్బులు కవర్లలో పెట్టి సజరానాగా ఇచ్చి సాగనంపు తున్నారు. అనంతరం తమ ఇష్టాను సారంగా మార్యులు. వేయించుకుని “జిల్లా స్థాయిలో అక్రమ ర్యాం కులతో, అబద్ధపు ప్రచారాలు” చేసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య ఈ కాలేజీలో కోర్సు పూర్తయిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్, ఓడి (CD) సర్టిఫికెట్స్ ఇప్పిస్తానని చెప్పి వేలకు వేలు వసూలు చేసి ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఈ ‘ఏజెంట్’ పై వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం తక్షణమే స్పందించాలి!

విద్యార్థుల నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు, ప్రభుత్వం నుండి ఫీజు రియంబర్మెంట్ తీసుకుంటూ.., ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్న ఈ కళాశాలపై ప్రభుత్వం డి.ఎం.ఈ అధికారులు, తక్షణమే దృష్టి సారించాలి. “దేవుడి” పేరు పెట్టుకున్న ఈ కాలేజీ అక్రమాల పై తనిఖీలకు విచారణ. కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటూ, విద్యార్థులకు అన్ని వసతుల తో కూడిన నర్సింగ్ విద్య అంబేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

YouTube player
RELATED ARTICLES
- Advertisment -

Latest News