Thursday, January 15, 2026
EPAPER
Homeఅంతర్జాతీయంAfghanistan | ఇండియాలో దౌత్యవేత్త నియామకం

Afghanistan | ఇండియాలో దౌత్యవేత్త నియామకం

ఆఫ్గనిస్థాన్.. ఇండియాలో దౌత్యవేత్త(Diplomat in India)గా నూర్ అహ్మద్ నూర్‌(Noor Ahmed Noor)ని నియమించింది. ఇరు దేశాల సంబంధాలు(Relations) పెరుగుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరిగింది. ఆఫ్గనిస్థాన్.. మందులు(Medicines), వీసాలు(Visa), మానవతా సహాయం(Humanitarian Support) కోసం ఇండియా వైపు చూస్తోంది. పాకిస్థాన్‌(Pakistan)తో ఆ దేశ సంబంధాలు క్షీణించిన పరిస్థితుల్లో భారత్‌కు దగ్గరవుతోంది. ఆఫ్గనిస్తాన్ ఔషధ అవసరాలకు ఇండియా కీలక ప్రత్యామ్నాయ భాగస్వామిగా ఎదుగుతోందని ఆ దేశ ప్రజారోగ్య మంత్రి మవ్లావి నూర్ జలాల్ జలాలీ డిసెంబర్‌లో అన్నారు. ఇండియా సహకారంలో సరికొత్త అధ్యాయం తెరవాలని ఆఫ్ఘనిస్తాన్ చూస్తోందని చెప్పారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలను, నమ్మకమైన ఆరోగ్య భాగస్వామిగా ఇండియా పాత్రను ఆయన హైలైట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News