Homeనిజామాబాద్‌ZPHS Krishnajiwadi | టీచర్లుగా మారిన పదో తరగతి విద్యార్థులు.. ఆకట్టుకున్న బోధన..

ZPHS Krishnajiwadi | టీచర్లుగా మారిన పదో తరగతి విద్యార్థులు.. ఆకట్టుకున్న బోధన..

  • కృష్ణాజివాడి జడ్పీహెచ్‌ఎస్‌లో స్వయం పరిపాలన దినోత్సవ సందడి..
  • SA-1 పరీక్షల్లో మెరిసిన టాప్-10 విద్యార్థులకు ‘బిగ్ హెల్ప్’ బహుమతులు..

తాడ్వాయి: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాడ్వాయి మండలం కృష్ణాజివాడి జడ్పీహెచ్‌ఎస్(ZPHS Krishnajiwadi) పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం తో పాటు బాలల దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకల్లో పదో తరగతి విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా మారి, తోటి విద్యార్థులకు ఉత్సాహంగా పాఠాలు బోధించారు. పాఠాలు చెప్పిన తర్వాత తమ టీచింగ్ అనుభవాలను తోటి విద్యార్థులతో పంచుకున్నారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో పాఠశాల హెచ్‌ఎంగా రిషివర్ధన్, పీఈటీగా సృజన్ కుమార్, అటెండర్‌గా రాఘవ బాధ్యతలు నిర్వర్తించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులుగా మారి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హెచ్‌ఎం రామస్వామి, ఎస్ఎంసీ చైర్‌పర్సన్ హేమలత బహుమతులు అందజేసి అభినందించారు.

- Advertisement -
Self Governance Day at ZPHS Krishnajiwadi3

‘బిగ్ హెల్ప్’ సౌజన్యంతో బహుమతుల పంపిణీ:

ఇదే కార్యక్రమంలో ‘బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్’ స్వచ్ఛంద సంస్థ అందజేసిన బహుమతులను ఎంఈఓ రామస్వామి, ఎస్ఎంసీ చైర్‌పర్సన్ హేమలత చేతుల మీదుగా విద్యార్థులకు అందించారు. ఇటీవల జరిగిన SA-1 పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిళ్లను బహుమతిగా ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులంతా ఒక లక్ష్యంతో, క్రమశిక్షణతో చదువుకోవాలని, బిగ్ హెల్ప్ సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ విద్యార్థుల చదువుకు అండగా నిలుస్తున్న ‘బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్’ ఫౌండర్ చాంద్ పాషాకు పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News