Tuesday, November 11, 2025
ePaper
Homeఅంతర్జాతీయంNobel | ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం..

Nobel | ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం..

ఆర్థిక శాస్త్రంలో 2025 సంవత్సరానికి రాయల్ స్వీడిష్ బెల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రతిష్టాత్మక నోబెల్(Nobel ) పురస్కారం ప్రకటించింది. ఈ సంవత్సరానికి ముగ్గురి శాస్త్రవేత్తలను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ‘ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి’ (ఇన్నోవేషన్-బేస్డ్ ఎకనామిక్ గ్రోత్) అనే అంశంపై చేసిన ముఖ్య పరిశోధనలకు జోయెల్‌ మోకిర్‌, ఫిలిప్‌ అఘియన్‌, పీటర్‌ హౌవిట్‌ ఈ పురస్కారం అందుకోనున్నారు. మోకిర్ అమెరికన్-ఇజ్రాయెలీ ఆర్థికవేత్త కాగా, హోవిట్ కెనడా, అఘియన్ ఫ్రాన్స్కు చెందిన ఆర్థిక నిపుణులు. సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు మోకిర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ‘క్రియేటివ్ డిస్ట్రక్షన్’ ద్వారా నిరంతర వృద్ధి సిద్ధాంతానికిగానూ మిగతా ఇద్దరికి నోబెల్ ప్రకటించారు. వైద్యవిభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన నేటితో ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News