Wednesday, December 10, 2025
EPAPER
Homeనిజామాబాద్‌Nizamabad MP | జేపీ నడ్డాకి జన్మదిన శుభాకాంక్షలు

Nizamabad MP | జేపీ నడ్డాకి జన్మదిన శుభాకాంక్షలు

కేంద్ర మంత్రి(Union Minister), బీజేపీ అధ్యక్షుడు(BJP President) జేపీ నడ్డా(JP Nadda)కి నిజామాబాద్ ఎంపీ(Nizamabad MP) ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు(Birthday Greetings) తెలిపారు. జేపీ నడ్డా వినయం, సౌమ్య స్వభావం, ఆదర్శప్రాయమైన సంస్థాగత నాయకత్వం జాతీయ రాజకీయాల్లో ఆయనకు అపార గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. బీజేపీని బలోపేతం చేయడంలో నడ్డా కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజల ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో నడ్డా చేసిన కృషి నిజంగా ప్రశంసనీయమని తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యంతో సుదీర్ఘకాలం దేశానికి సేవ చేయాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు. కుటుంబంతో జేపీ నడ్డాను కలిసిన ఫొటో పెట్టారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News