- రేసులో ముందున్న నిత్యా రామన్..
అమెరికాలో భారతీయ సంతతి మహిళ నిత్యా రామన్ లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నిక రేసులో దూసుకెళ్తున్నారు. నవంబర్‌లో జరిగే ఆ ఎన్నికల గురించి అప్పుడే ఫైట్ మొదలైంది. ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. నిత్యా రామన్ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలో ఉన్న సుమారు 48 వేల ఓట్లలో ఆమె ఆదివారం నాటికి 40 శాతం ఓట్లను గెలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి ప్రాట్ కన్నా 10 వేల అధిక ఓట్లను ఆమె కైవసం చేసుకున్నట్లు ఓ రిపోర్టు ద్వారా తెలిసింది.
కేరన్ బ్రాస్, స్పెన్సర్ ప్రాట్‌పై జూన్ 2వ తేదీన జరిగిన ప్రైమరీలో అత్యధిక ఓట్లను సాధించింది. దీంతో నిత్యా రామన్ ఓట్ షేర్‌లో 5 పాయింట్లతో ముందున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రాట్ పోటీ చేస్తుండగా, నిత్యా రామన్ మాత్రం ప్రోగ్రెసివ్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. కాలిఫోర్నియాలో ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. మెయిల్ ద్వారా ఎక్కువగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల తేదీ ముగిసిన వారం రోజుల వరకు కూడా పోస్టుమార్క్ బ్యాలెట్లను లెక్కిస్తుంటారు. ఇక నిత్యా రామన్.. లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్‌లో సభ్యురాలు.
ఆమె అర్బన్ ప్లానర్. హార్వర్డ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎంఐటీ యూనివర్సిటీలో కూడా ఆమె చదువుకున్నది. 2020లో సిటీ కౌన్సిల్ కోసం పోటీపడినట్లు ఆమె వెబ్‌సైట్‌లో ఉంది. ఆ ఎన్నికల్లో ఘన విజయం ఆమె సాధించింది. సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి ఆసియా అమెరికన్ మహిళగా, తొలి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. 2024 మార్చిలో నిత్యా రామన్ రెండోసారి సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సిట్టింగ్ కౌన్సిల్ మెంబర్‌ను ఓడించిన రికార్డును నిత్యా రామన్ సొంతం చేసుకున్నట్లు ఏబీసీ న్యూస్ తెలిపింది. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించడం లాంటి కార్యక్రమాలను ఆమె సిటీ కౌన్సిల్ మెంబర్‌గా నిర్వర్తించారు.
